AP: ప్రైవేటు బస్సుల అతివేగం వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. గంటకు 80 కిలోమీటర్ల వేగ పరిమితిని దాటితే బస్సులను సీజ్ చేసి, స్పీడ్ కంట్రోల్ టూల్స్ ను పరిశీలిస్తారు. ఏపీలో ఆల్
ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఉన్న 1800 బస్సులను ట్రాక్ చేస్తున్నారు. ఈ విధానం తెలంగాణలోనూ అమలు చేస్తే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని సూచిస్తున్నారు.