ఒక్కరోజు ముందే పింఛన్ అందించనున్న ఏపీ ప్రభుత్వం

123చూసినవారు
ఒక్కరోజు ముందే పింఛన్ అందించనున్న ఏపీ ప్రభుత్వం
AP: ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు అందుకుంటున్న వారికి జనవరి 2026 పింఛన్లలో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 1వ తేదీ సెలవు దినం కావడంతో, జనవరి నెల పింఛన్‌ను ఒకరోజు ముందుగానే, అంటే డిసెంబర్ 31వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా అందించనున్నట్లు సమాచారం. డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7:00 గంటల నుంచి పింఛన్ పంపిణీ ప్రారంభం కానుంది.