AP: రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు తీపి కబురు అందించింది. పొదుపు సొమ్మును తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 22 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.1194 కోట్లు వారి ఖాతాల్లో జమ కానున్నాయి. గతంలో అభయహస్తం పథకం కింద పింఛన్ కోసం పొదుపు చేసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వడం లేదని మహిళలు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించిన చంద్రబాబుకు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.