AP: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు టీటీడీ అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.