AP: వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఏపీ ముందు వరుసలో నిలుస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సోమవారం గుంటూరులో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వాటర్ షెడ్స్ అభివృద్ధిపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాలు పెంచడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమన్నారు. చాలా కారణాలతో నీటి నిల్వ సామర్థ్యం రోజురోజుకూ తగ్గిపోతోందన్నారు.