ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, నారాయణ, కందుల దుర్గేష్, టీజీ భరత్ వివిధ దేశాల్లో పర్యటిస్తూ పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నారు. మంత్రి నారాయణ అరబ్ దేశాల్లో పర్యటిస్తున్నారు. మంత్రి దుర్గేష్ లండన్‌లో పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు.