ఏపీ శాసనమండలి వాయిదా పడింది. వైసీపీ నేతల ఆందోళన నడుమ స్పీకర్ సభను వాయిదా వేశారు. వైసీపీ నేతలు స్పీకర్ పోడియం ఎక్కి ఆందోళన చేస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సభను అదుపులో ఉంచేందుకు కొద్ది సేపటి వరకు సభ వాయిదా పడింది. ఇక వైసీపీ నేతలు నల్లకండువాలతో శాసన మండలికి వచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తున్నారు.