ఏపీ మద్యం కేసు.. నిందితుల రిమాండ్‌ పొడిగింపు

58చూసినవారు
ఏపీ మద్యం కేసు.. నిందితుల రిమాండ్‌ పొడిగింపు
AP: మద్యం కేసులో నిందితుల రిమాండ్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 24 వరకు పొడిగించింది. నిందితుల బెయిల్ పిటిషన్లపై శుక్రవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో సిట్‌ అధికారులు కీలక ఆధారాలు సేకరించారని, నిందితులకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిట్‌ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం, తీర్పును రిజర్వ్ చేసింది. అనంతరం నిందితులకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.