ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డికి ఏసీబీ కోర్టు ఇచ్చిన డీఫాల్ట్ బెయిల్‌ను న్యాయస్థానం రద్దు చేసింది. వీరి బెయిల్ రద్దుకు సీఐడీ వేసిన పిటిషన్‌ను కోర్టు అనుమతించింది. ఈ నెల 26వ తేదీలోపు జడ్జి ఎదుట ముగ్గురూ సరెండర్ కావాలని ఆదేశించింది.