AP: పెన్షన్‌పై ఫేక్ వీడియో చేసిన వ్యక్తి అరెస్ట్

11886చూసినవారు
AP: పెన్షన్‌పై ఫేక్ వీడియో చేసిన వ్యక్తి అరెస్ట్
సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో పల్లెల రమేశ్ అనే వ్యక్తి పెన్షన్ కోసం చేయి లేనట్లు నటించిన విషయం తెలిసిందే. కూటమికి ఓటు వేసినందుకు పెన్షన్ రద్దు చేశారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ‘నా మానసిక స్థితి బాలేదు. మద్యం మత్తులో అలా మాట్లాడాను. మా అమ్మకు వితంతు పెన్షన్ రాలేదని అలా వీడియో చేస్తే అయినా వస్తుందని అలా చేశాను. నాకు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై ఎలాంటి కక్ష లేదు’ అని రమేశ్ పోలీసులతో చెప్పాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్