విశాఖపట్నం ఆరిలోవలో శుక్రవారం ఓ వ్యక్తి అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చుట్టు పక్కన వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుడిని అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు. కాగా కుటుంబంలో మనస్పర్థల కారణంగా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు సమాచారం.