ప్రధాని నరేంద్ర
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని
బీజేపీ చేపడుతున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు కీలక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రచారం, సమన్వయ బాధ్యతలను సత్యకుమార్ పర్యవేక్షించనున్నారు.
మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే ఈ అభియాన్ ప్రధాన ఉద్దేశంగా పార్టీ పెద్దలు పేర్కొన్నారు.