AP: రాష్ట్ర రాజకీయాల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మంత్రిగా బిజీ షెడ్యూల్‌తో ఉండే నేతలు కూడా సినిమాల్లోకి వస్తున్నారు. తాజాగా మంత్రి వాసంశెట్టి సుభాష్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన 'ఎవరది' అనే సినిమాలో జమిందార్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అలాగే షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. గ్రామీణ మూఢనమ్మకాలు, ఆడపిల్లలపై దారుణాలను కథాంశంగా తీసుకున్న ఈ సినిమా, మంత్రి నటనతో చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.