ఏపీ పోలీసులకు క్రీడల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది: డీజీపీ

0చూసినవారు
ఏపీ పోలీసులకు క్రీడల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది: డీజీపీ
ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ సందర్భంగా డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో ఏపీ పోలీసులకు క్రీడల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. జాతీయ స్థాయి పోటీలలో ఏపీ పోలీస్ క్రీడాకారులు మొత్తం 39 పతకాలు సాధించి రాష్ట్ర కీర్తిని ఇనుమడింపజేశారని కొనియాడారు. వెయిట్‌లిఫ్టింగ్, యోగా, బ్యాడ్మింటన్, జూడో, టేక్వాండో, పెన్కాట్ సిలాట్ తదితర విభాగాలలో మన పోలీసులు ప్రతిభ కనబరిచారని, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పోలీసు శాఖ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్