AP: ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 నోటిఫికేషన్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణామండలి విడుదల చేసింది. మార్చి 3, 2026 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. పదోతరగతి ఉత్తీర్ణులైన వారు ఏప్రిల్ 4, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఏప్రిల్ 25, 2026న జరగనుంది. ఓసీ, బీసీలకు రూ.400, ఎస్సీ, ఎస్టీలకు రూ.100 దరఖాస్తు రుసుముగా నిర్ణయించారు.