AP: వచ్చే 3 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు

16చూసినవారు
AP: వచ్చే 3 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే సూచనలున్నాయని అధికారులు హెచ్చరించారు. పశ్చిమ జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన అల్పపీడనం ప్రస్తుతం ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. రాగల మూడు రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్