ఏపీలో రాజ్‌భవన్ పేరును లోక్ భవన్‌గా మార్చారు. పేరు మార్చడానికి గవర్నర్ ఆమోదం తెలపడంతో నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల అధికారిక నివాసం రాజ్‌భవన్ పేరును లోక్ భవన్‌గా మార్చాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ క్రమంలోనే ఏపీలోనూ పేరు మార్చారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, తమిళనాడు, త్రిపుర, కేరళ, ఒడిశా, తెలంగాణ రాజ్‌భవన్‌లను లోక్ భవన్‌లుగా మార్చారు. ఇప్పుడు ఈ జాబితాలో ఏపీ కూడా చేరింది.