రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది: రామ్మెహన్ నాయుడు

9చూసినవారు
రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది: రామ్మెహన్ నాయుడు
రాజ్యసభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును కేంద్రమంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టారు. దీనిపై కేంద్ర మంత్రి రామ్మెహన్ నాయుడు స్పందిస్తూ.. విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిందని, విభజన జరిగిన తీరుకు తాము వ్యతిరేకమని ఆయన అన్నారు. ప్రజా రాజధాని అమరావతి చరిత్రలో గుర్తుంటుందని, 2019-2024 మధ్య ఏపీకి చీకటి రోజులు అని, అప్పటి ప్రభుత్వం అమరావతిని నాశనం చేసి, మూడు రాజధానుల పేరుతో గందరగోళం సృష్టించిందని విమర్శించారు. ఐదేళ్లపాటు అమరావతి రైతులను వేధించారని, చిన్న రాష్ట్రాలకు కూడా రాజధాని ఉందని, కానీ ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్