ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు గ్రామీణ బ్యాంకులు (ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి బ్యాంక్, శ్రీపద్మావతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సాగర్ గ్రామీణ బ్యాంక్) ఒకే గొడుగు కింద విలీనమవుతున్నాయి. ఈ విలీన ప్రక్రియలో భాగంగా అక్టోబర్ 9న సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 10 గంటల వరకు అన్ని బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతాయి. ఈ టైంలో ఏటీఎం, యూపీఐ, ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ లావాదేవీలు కూడా అందుబాటులో ఉండవు.