ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టులో మార్పులు చేసింది. మూడో దశలో బనకచర్లను తప్పించి, నల్లమల సాగర్‌కు నీటిని తరలించాలని కొత్త ప్రణాళిక వేసింది. గతంలో బనకచర్లకు శ్రీశైలం నుంచి నీటిని తరలించాలని భావించిన ఏపీ.. ఇప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటర్‌తో నిర్మించిన నల్లమల సాగర్‌కు పోలవరం నుంచి నీటిని తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టును సుమారు రూ.59 వేల కోట్లతో చేపట్టనున్నట్లు సమాచారం.