ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు అర్హత సాధించేందుకు నిర్వహించే ఏపీ సెట్ 2026 నోటిఫికేషన్ విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ విడుదల చేసింది. మార్చి 28, 29 తేదీల్లో ఆన్‌లైన్ పరీక్షలు జరగనున్నాయి. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 9, 2026 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 19 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి.