ఏపీలో వారికి నెలకు రూ.5000 పింఛన్.. భారీగా దరఖాస్తులు

32చూసినవారు
ఏపీలో వారికి నెలకు రూ.5000 పింఛన్.. భారీగా దరఖాస్తులు
AP: కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పరిధిలోని భూమి లేని పేదల కోసం నెలకు రూ.5 వేల పింఛన్ అందించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి యర్రబాలెం, నవులూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, నీరుకొండ, బేతపూడి గ్రామాల్లో సోమవారం గ్రామసభలు నిర్వహించారు. ఈ పింఛన్ కోసం రైతులు, రైతు కూలీల నుంచి భారీగా వినతులు వచ్చాయి. అధికారులు సుమారు 3298 దరఖాస్తులు స్వీకరించారు. వీటిలో నవులూరు నుంచి 1150, యర్రబాలెం నుంచి 1100 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్