మొహర్రం ఆప్షనల్ సెలవును మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

8చూసినవారు
మొహర్రం ఆప్షనల్ సెలవును మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
ఏపీలో మొహర్రం ఆప్షనల్ సెలవు తేదీని మార్చాలని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రతి ఏడాది మొహర్రం పండుగకు ముందు రోజు ఆప్షనల్ సెలవు ప్రకటించే సంప్రదాయం ఉందని, అయితే ఈసారి మొహర్రం జూన్ 26న ఉండగా జూన్ 16న ఆప్షనల్ హాలిడే ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది. తెలంగాణ ప్రభుత్వం జూన్ 26న సాధారణ సెలవు, జూన్ 25న ఆప్షనల్ సెలవు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ, అదే విధానాన్ని ఏపీలోనూ అమలు చేయాలని సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్