యాపిల్ సంస్థ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌తో పాటు, ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలి మడతపెట్టే ఐఫోన్ నమూనా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ సాంకేతిక నిపుణుడు సన్నీ డిక్సన్ పంచుకున్న ఈ చిత్రాల్లో, పుస్తకంలా విచ్చుకునే ఈ ఫోన్ ఆకర్షణీయంగా, ఆధునిక సాంకేతికతకు నిదర్శనంగా కనిపిస్తోంది. తెరిచినప్పుడు చిన్న టాబ్లెట్‌లా మారే ఈ ఫోన్, ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్‌తో పోలిస్తే వెడల్పుగా ఉంటుంది. దీని లోపలి తెర ఐప్యాడ్ మినీ పరిమాణంలో, బయట నోటిఫికేషన్ల కోసం చిన్న స్క్రీన్‌తో ఉండే అవకాశం ఉంది.