ప్రేమికుల దినోత్సవం సందర్భంగా యాపిల్ భారత మార్కెట్లో వాలెంటైన్స్ డే సేల్‌ను ప్రారంభించింది. ఈ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందిస్తోంది. యాపిల్ నేరుగా ధరలు తగ్గించకుండా, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డులపై బ్యాంక్ ఆధారిత ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌లు అందిస్తోంది. ఐఫోన్ 17 రూ.77,900 ప్రారంభ ధరకు, రూ.5,000 క్యాష్‌బ్యాక్‌తో లభిస్తోంది. ఐఫోన్ 17 ప్రో రూ.1,29,900 తగ్గింపు ధరకు, రూ.5,000 క్యాష్‌బ్యాక్‌తో అందుబాటులో ఉంది.