AP ప్రభుత్వం PM ఆవాస్ యోజన గ్రామీణ–NTR పథకం దరఖాస్తు గడువును నవంబర్ 30 నుంచి డిసెంబర్ 14 వరకు పొడిగించింది. అర్హత కలిగిన వారు దరఖాస్తుల కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ పథకం కింద సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు గృహ నిర్మాణానికి రూ.2.50 లక్షల వరకు సాయం, సొంత స్థలం లేనివారికి 3 సెంట్ల స్థలం సహా ఆర్థిక ప్రోత్సాహం అందించబడుతుంది.