ఏపీ ప్రభుత్వం బార్ల లైసెన్సుల కోసం రీనోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 301 బార్లకు ఓపెన్ కేటగిరీలో లైసెన్సులు కేటాయించనున్నారు. గతంలో అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ కారణంగా తక్కువ దరఖాస్తులు రావడంతో 299 లైసెన్సులు మిగిలిపోయాయి. ఇటీవల ప్రభుత్వం ఏఆర్ఈటీని రద్దు చేయడంతో, మిగిలిన 299 లైసెన్సులతో పాటు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని రెండు బార్లను కలిపి 301 బార్లకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఫిబ్రవరి 4 సాయంత్రం 6 గంటల వరకు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించి, ఫిబ్రవరి 5న లక్కీ డిప్ ద్వారా లైసెన్సులు కేటాయిస్తారు.