AP: వివిధ రకాల ఉపాధి కల్పన సంస్థలతో పాటు, అందులో పనిచేసే కార్మికులను ప్రోత్సహించేందుకు ఈఎస్ఐసీ ప్రవేశపెట్టిన స్ప్రీ (స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయిస్-2025) పథకం గడువు ఈ నెల 31తో ముగియనుంది.ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 2.50 లక్షల మంది కార్మికులను రిజిస్ట్రేషన్ చేయించి వారికి భద్రత కల్పించినట్లు తెలిపింది. సుమారు 2 వేల కంపెనీలు, యాజమాన్యాలు పాత బకాయిల నుంచి లబ్ధి పొందినట్లు ఈఎస్ఐసీ రీజనల్ డైరెక్టర్ తెలిపారు.