జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

8823చూసినవారు
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
దేశంలో విద్యా రంగానికి సేవలందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందజేస్తుంది. 2026 సంవత్సరానికి గాను ఈ అవార్డుల కోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, పాఠశాల విద్యా విభాగం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించింది. గుర్తింపు పొందిన పాఠశాలల్లో కనీసం 10 ఏళ్లపాటు రెగ్యులర్ సర్వీస్ చేసినవారు అర్హులు. అర్హులు National Awards to Teachers పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం దరఖాస్తు ప్రింట్ కాపీలను రెండు సెట్లుగా జులై 14 సాయంత్రం 5 గంటలలోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్