పింఛన్ల కోసం దరఖాస్తు.. వాట్సప్‌లో క్షణాల్లోనే అన్నీ సేవలు

13534చూసినవారు
పింఛన్ల కోసం దరఖాస్తు.. వాట్సప్‌లో క్షణాల్లోనే అన్నీ సేవలు
AP: కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇకపై సదరం సర్టిఫికేట్‌ను మొబైల్ ద్వారా, వాట్సప్ ద్వారానే సులభంగా పొందవచ్చు. గతంలో స్లాట్ బుకింగ్ కోసం గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు వాట్సప్ ద్వారానే స్లాట్ అవైలబిలిటీ, బుకింగ్, సర్టిఫికేట్ డౌన్‌లోడ్ వంటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలను ఏపీ ప్రభుత్వం వాట్సప్‌లో అందుబాటులోకి తెచ్చింది.

సంబంధిత పోస్ట్