ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం MPP, ZPPలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ జీవో జారీ చేసింది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ఈనెల 23, 24 తేదీలతో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ZPలకు కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా, MPPలకు MDO స్థాయికి మించిన అధికారిని ప్రత్యేక అధికారులుగా నియమించాలని ఆదేశించింది. ఈ
నియామకాలు ఈనెల 24, 25 తేదీల నుంచి అమల్లోకి వస్తాయి. కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టే వరకు లేదా ఆరు నెలల వరకు వీరు కొనసాగుతారు.