AP: మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 31 మున్సిపాలిటీలకు సూపర్వైజర్ అధికారులను ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన బాధ్యతలు, ఆదేశాలను అమ
లు చేయడం, జిల్లా యంత్రాంగం-ఎన్నికల సంఘానికి సమన్వయం, ఓటర్ల జాబితా పరిశీలన, సిబ్బందికి ఎన్నికల శిక్షణ, రికార్డుల నిర్వహణ, పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లు తదితర బాధ్యతలను సూపర్వైజర్ అధికారులు నిర్వర్తించనున్నారు.