AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు మున్సిపాలిటీలకు వైస్ ఛైర్‌పర్సన్‌లుగా ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మచిలీపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ వైస్ ఛైర్ పర్సన్‌గా కృష్ణా జిల్లా జేసీ, నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ వైస్ ఛైర్ పర్సన్‌గా నెల్లూరు జిల్లా జేసీ, ఏలూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ వైస్ ఛైర్ పర్సన్‌గా ఏలూరు జేసీ బాధ్యతలు స్వీకరించనున్నారు.