సెంట్రల్ బ్యాంక్ ఆఫ్
ఇండియా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 4,500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి
నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 31, 2026 నాటికి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులైన 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష, స్థానిక భాషా పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. శిక్షణ కాలంలో నెలకు రూ.15,000 స్టైపెండ్ అందిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తులు జూన్ 12 నుంచి ప్రారంభమై, జూన్ 22, 2026తో ముగుస్తాయి. ఆన్‌లైన్ పరీక్ష జూలై 2026 మొదటి వారంలో నిర్వహించబడుతుంది.