ఏపీఎస్ఆర్టీసీ కొత్త ప్రయోగం.. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు

24చూసినవారు
ఏపీఎస్ఆర్టీసీ కొత్త ప్రయోగం.. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు
ఏపీఎస్ఆర్టీసీ డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 'గ్రీన్ ఇంద్ర' పేరుతో ఆధునిక సౌకర్యాలతో, తక్కువ శబ్దంతో, కాలుష్యం లేకుండా ప్రశాంతమైన ప్రయాణాన్ని అందించే ఈ బస్సులు హై కెపాసిటీ బ్యాటరీలతో ఎక్కువ దూరం ప్రయాణించగలవు, వేగంగా ఛార్జ్ అవుతాయి. ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ సిస్టమ్స్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇంజనీరింగ్ అధికారులు పరీక్షించి, అన్ని పరీక్షల్లో విజయవంతమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం ట్రయల్ రన్‌గా కొన్ని బస్సులు అందుబాటులోకి రానున్నాయి.

సంబంధిత పోస్ట్