AP: ఆక్వా రైతులకు బిగ్ షాక్ తగిలింది. రొయ్యల మేత ధరలు మరోసారి పెరిగాయి. రెండు నెలల వ్యవధిలో బ్లాక్ టైగర్ రొయ్య మేత కిలోకి రూ.24, వనామీ రొయ్యల మేత రూ.18 చొప్పున పెరిగాయి. ధరలు పెరగడంతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. సీఎం చంద్రబాబు సూచనలు చేసినా ధరల విషయం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.