జగన్ పీఏకు బినామీలు?

22చూసినవారు
జగన్ పీఏకు బినామీలు?
AP: వైసీపీ అధినేత జగన్ పీఏ కే.నాగేశ్వరరెడ్డికి బినామీలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. మద్యం కుంభకోణం సొమ్ముతో కొన్న ఆస్తులు, పెట్టిన పెట్టుబడులన్నీ తన పేరిట, తన కుటుంబీకుల పేరిట ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో కొన్నింటిని బినామీల పేరిట పెట్టినట్లు తేల్చింది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకరరెడ్డి ఆ బినామీల్లో ఒకరని సిట్ విచారణలో వెల్లడైంది.