ఆ భయంతోనే ఏపీకి మావోయిస్టులు?

19246చూసినవారు
ఆ భయంతోనే ఏపీకి మావోయిస్టులు?
ఏపీలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నిన్న పలు జిల్లాల్లో తనిఖీలు నిర్వహించి.. 50 మంది వరకు మావోయిస్టులను అదుపులోకి తీసుకుంది. అయితే లొంగిపోయిన మావోయిస్టులు ఎక్కడ తమ వివరాలు బయటపెడతారేమోనని మిగతా నేతలు భయపడుతున్నట్లు తెలుస్తోంది. దాంతో అనేక మంది ఛత్తీస్‌గఢ్ నుంచి ఏపీకి వచ్చి తలదాచుకుంటున్నారని సమాచారం. మావోయిస్టులు ఎలాంటి భయం లేకుండా లొంగిపోవడానికి రావాలని, తాము రక్షణ కల్పిస్తామని ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా తెలిపారు.

సంబంధిత పోస్ట్