2005కు ముందు ముద్రించిన పాత రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను జూలై 1వ తేదీ నుంచి రద్దు చేయనున్నట్లు సోషల్ మీడియాలో ఒక సందేశం వైరల్ అవుతోంది. అయితే, ఈ వార్తపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పష్టతనిచ్చింది. ఇది పూర్తిగా అవాస్తవమని, ఇది ఫేక్ న్యూస్ అని PIB తెలిపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రజలను కోరింది. ఈ నోట్లను రద్దు చేయడానికి ప్రభుత్వం లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్
ఇండియా (RBI) ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని PIB తన ఫ్యాక్ట్ చెక్‌లో వెల్లడించింది.