చలికాలంలో రాత్రి ఉష్ణోగ్రతలు చాల తక్కువగా ఉంటాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినప్పుడు వరి నారుమళ్లలో పెరుగుదల సరిగా ఉండదు. ఇందుకోసం రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. విత్తనాలను మండెకట్టి దమ్ముచేసిన పొలంలో నారుమళ్లు పోసుకోవాలి. భాస్వరాన్ని రెట్టింపు మోతాదులో నారుమడి దమ్ములోనే వేయాలి. అలాగే నారుమళ్లకు రాత్రి వేళల్లో నీరు నిండుగా పెట్టి తెల్లవారుజామున కొత్త నీరు పెట్టాలి.