ఏపీలో స్థానిక ఎన్నికలకు SEC సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీల విభజన, పునర్వ్యవస్థీకరణపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఒక పంచాయతీని విభజించడం, గ్రామాలను మరో పంచాయతీలో కలపడం, రెండు పంచాయతీలను విలీనం చేయడం వంటివి ఈజీ అవుతాయి. అలాగే పంచాయతీలను మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేయడానికి కూడా అవకాశం ఏర్పడింది. ఈ ప్రక్రియ స్థానిక ఎన్నికలకు ముందే పూర్తి కానుంది.