AP: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కొలికపూడి వివాదంపై పార్టీ సీనియర్లతో చర్చించిన అధినేత.. కొలికపూడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ కంటే వ్యక్తిగత పరపతి వల్లే ఎమ్మెల్యేలుగా గెలిచామని కొద్ది మంది భావిస్తున్నారని, అలాంటి వారితో పార్టీకి సమస్యలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.