వైసీపీ నేతలు జగన్ మాట వినడం లేదా?

6737చూసినవారు
వైసీపీ నేతలు జగన్ మాట వినడం లేదా?
AP: వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తున్న పార్టీ కార్యక్రమాలకు, ఎన్నికల సన్నద్ధతకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కొందరు నాయకులు సరిగా స్పందించడం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధినేత హెచ్చరికలు, సూచనలు కూడా వారిని చురుగ్గా పనిచేసేలా చేయడం లేదని, నియోజకవర్గాలపై దృష్టి సారించకుండా సొంత పనుల్లోనే మునిగిపోతున్నారని కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. రాజధాని అమరావతి ఉన్న కీలక జిల్లాలోనే ఈ పరిస్థితి ఉండటం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. బాపట్ల, రేపల్లె, సత్తెనపల్లి, తాడికొండ నియోజకవర్గాల్లో నాయకుల తీరుపై విమర్శలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్