AP: సింహాచలం వరహాలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్ర ఉత్సవాలు ఆదివారం (నవంబర్ 30) నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఐదు రోజుల పాటు అంటే డిసెంబర్ 4 వరకు నిర్వహించనున్నట్లు ఈఓ సుజాత తెలిపారు. ఈ ఉత్సవాల కారణంగా నవంబర్ 30 నుంచి డిసెంబర్ 4 వరకు ఆలయంలో ప్రతి రోజు జరిగే ఆర్జీత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. అయితే, స్వామివారి దర్శనాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.