OCT 10 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు పూర్తిగా బంద్

49చూసినవారు
OCT 10 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు పూర్తిగా బంద్
AP: అక్టోబర్ 10 నుంచి పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలన్నింటినీ నిలిపివేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించింది. విజయవాడలో బుధవారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సంఘం ప్రతినిధులు వెల్లడించారు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.3 వేల కోట్లకు పైగా బకాయిపడిందని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.2 వేల కోట్లకుపైగా బిల్లులను 400 రోజులుగా పరిశీలన దశలోనే ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్