ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి!

12468చూసినవారు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి!
AP: మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నాహాలు పూర్తి చేసింది. రిజర్వేషన్లు ఖరారైన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రంలో 100 పట్టణ స్థానిక సంస్థలు, 13,313 గ్రామ పంచాయతీలు, 9,983 MPTC, 661 ZPTC స్థానాలు ఉన్నాయి. మొత్తం 1 లక్ష బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయగా, అక్టోబర్ - డిసెంబర్ మధ్య ఎన్నికలు పూర్తి చేసి, నూతన ఏడాది నాటికి కొత్త పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెల మొదటి వారంలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్