ప్రధాని
మోదీ, హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో 2021-2026 మధ్య 36 దేశాల నుంచి 274 మంది పరారీ నేరస్థులను భారత్‌కు తీసుకువచ్చారు. ఆర్థిక నేరస్థుల చట్టం, భారత్‌పోల్ ద్వారా దర్యాప్తు సంస్థలను ఇంటర్‌పోల్‌తో అనుసంధానించి, సమాచార మార్పిడిని వేగవంతం చేశారు. గత మూడేళ్లలో 401 మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయగా, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద రూ. 17,874 కోట్ల ఆస్తులను జప్తు చేసి, రూ. 18,762 కోట్లు రికవరీ చేశారు.