AP: అనకపల్లి జిల్లా నర్సీపట్నంలో సృష్టి క్షేత్రం కేసులో వైసీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ వైసీపీ అధ్యక్షుడు ఎకాశివ, సుర్ల నాయుడును అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గణేష్, అతని పీఏ బాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, వైసీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి.