టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పుసపాటి అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్‌గా నియమించారు. హర్యానా గవర్నర్‌గా ప్రొఫెసర్ అశీం కుమార్ ఘోష్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బీజేపీ నేత కవీందర్ గుప్తాను నియమించారు. ఈ నియామకాలు జూలై 14న రాష్ట్రపతి భవన్ అధికారికంగా ప్రకటించింది.