నేటి కాలంలో మహిళల్లో థైరాయిడ్ సమస్య, ముఖ్యంగా హైపోథైరాయిడిజం పెరుగుతోంది. థైరాయిడ్ గ్రంథి T3, T4 హార్మోన్లను తగినంత ఉత్పత్తి చేయకపోవడం వల్ల అలసట, బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైద్యులు సూచించిన చికిత్సతో పాటు, ఆయుర్వేదంలో అశ్వగంధ నీరు ఒత్తిడిని తగ్గించి, హార్మోన్ల స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.